Andhra Pradesh: అదనపు రుణాలు పొందేందుకు ఏపీ సహా 6 రాష్ట్రాలకు అనుమతినిచ్చిన కేంద్రం

Center gives permission to AP to get additional borrowings
షార్ట్స్‌లో చూడండి
విద్యుత్ రంగంలో సంస్కరణలను అమలు చేసినందుకు గాను అదనపు రుణాలు పొందేందుకు 6 రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది. అదనంగా 0.5 శాతం రుణాలు పొందేందుకు అనుమతిని మంజూరు చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు అనుమతిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ 6 రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 12 రాష్ట్రాలకు ఈ అవకాశం లభించగా... ఇప్పుడు కేవలం 6 రాష్ట్రాలకు మాత్రమే అనుమతి రావడం గమనార్హం. ఈ 6 రాష్ట్రాల్లో ఏపీ, అసోం, కేరళ, రాజస్థాన్, సిక్కిం, పశ్చిమబెంగాల్ ఉన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ కల్పించిన అవకాశంతో ఏపీ ప్రభుత్వం మరో రూ. 5,858 కోట్ల అప్పును తీసుకునే వెసులుబాటు కలిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Borrowings

More Telugu News