మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 100 కిలోల గంజాయి స్వాధీనం
- స్థానిక పోలీసులతో కలిసి స్వాధీనం చేసుకున్న నార్కోటిక్ సిబ్బంది
- రాయగఢ్ నుంచి దూల్ పేట మీదుగా సూరంగల్‌కు గంజాయిని చేర్చినట్లు వెల్లడి
- యాభై ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన పోలీస్ అధికారులు
ఒడిశా రాయగఢ్ నుంచి దూల్ పేట మీదుగా సూరంగల్ గ్రామ వెంచర్‌కి గంజాయిని తీసుకు వచ్చినట్లు తెలిపారు. యాభై ప్యాకెట్లను స్వాధీనం చేసుకోగా, ఒక్కో ప్యాకెట్‌లో రెండు కిలోల గంజాయి ఉంటుందన్నారు. పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒడిశాకు చెందిన బాబర్ ఖాన్, దూల్ పేటకు చెందిన సతీష్ సింగ్‌లను అరెస్ట్ చేయగా, ఇద్దరు నిందితులు సునీల్ సింగ్, మనోజ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.