మహారాష్ట్ర, కర్ణాటకలో 'ఉగ్ర' కలకలం.. 15 మంది అరెస్ట్
- ఐఎస్ఐఎస్ టెర్రర్ మాడ్యుల్ కేసులో అదుపులోకి..
- పేలుడు పదార్థాలను తయారు చేశారనే అనుమానాలు
- రెండు రాష్ట్రాల్లో మొత్తం 41 చోట్ల కేంద్ర బలగాల సోదాలు
దేశ ఆర్థిక రాజధాని ముంబై పక్కనే ఉన్న థానె, పూణేలతో పాటు మిరాభయాందర్ లలో ఎన్ఐఏ సిబ్బంది, స్థానిక పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో ఆకిఫ్ అతీఖ్ నాచన్ సహా ఏడుగురిని అరెస్టు చేసింది. నాచన్ కిందటి ఆగస్టులో పేలుడు పదార్థాల తయారీ కేసులో అరెస్టయ్యాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చి తిరిగి టెర్రర్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తెలిసిందన్నారు. అయితే, మిగతా ఆరుగురిపై గతంలో ఎలాంటి కేసులు లేవని, అరెస్టు కాలేదని వివరించారు. మిగతా ఆరుగురిని థానెతో పాటు కర్ణాటకలో అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.