achampet: సీనియర్ నేతను... నేనూ మంత్రి పదవిని ఆశిస్తున్నా: అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

Achampet MLA in Minister aspirants list

  • మేం ప్రజల కోసం పని చేయకుంటే వారు నిలదీయవచ్చునని వ్యాఖ్య
  • వైఎస్ రాజశేఖరరెడ్డిలాగే రేవంత్ రెడ్డి పాలన ఉంటుందని జోస్యం
  • పార్టీకి మొదటి నుంచి విధేయుడిగా ఉన్నానని వెల్లడి

మేం ప్రజల కోసం పని చేయకుంటే వారు తమను నిలదీయవచ్చునని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఎల్బీ నగర్ స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇక్కడకు వచ్చిన వంశీకృష్ణ మాట్లాడుతూ.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిలాగే రేవంత్ రెడ్డి పాలన ఉంటుందని జోస్యం చెప్పారు. తానూ మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు తెలిపారు. తాను జిల్లాలో సీనియర్ నేతను అని, పార్టీకి మొదటి నుంచి విధేయుడిగా ఉన్నట్లు తెలిపారు. రేపటి ప్రమాణ స్వీకారానికి లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. మేం కనుక పని చేయకుంటే ప్రజలు తమను నిలదీయవచ్చునని స్పష్టం చేశారు. కాగా, రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 1.04 నాలుగు గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

  • Loading...

More Telugu News