అదే నా కల: కాంగ్రెస్ పార్టీ గెలుపుపై నిర్మాత బండ్ల గణేష్

Bandla Ganesh responds on Congress winning
  • తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు తన కల అన్న బండ్ల గణేష్
  • తాను చెప్పినట్లు జరుగుతున్నందుకు ఆనందంగా ఉందని వ్యాఖ్య
  • రేవంత్ రెడ్డి పార్టీని నడిపిన విధానం బాగుందన్న బండ్ల గణేష్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుపై ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. రేపటి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తన కల అన్నారు. తాను చెప్పినట్లుగా జరుగుతున్నందుకు తనకు ఆనందంగా ఉందన్నారు. ప్రమాణ స్వీకారోత్సవం ఏడో తేదీన అని చెప్పడంతో తాను సంతోషించానన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీని నడిపిన విధానం బాగుందన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలుచుకుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Advertisement
bandla ganesh
Tollywood
Revanth Reddy
Congress

More Telugu News