Congress: నేటి రాత్రి ఏడు గంటలకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం

  • ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై రాని స్పష్టత
  • ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాజ్ భవన్‌కు సామగ్రి తరలింపు
  • రాజ్ భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు
Chief Minister will take oath today evening

తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈ రోజు రాత్రి ఏడు గంటలకు ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎవరు? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను అప్పగించారు. ఈ రోజే సీఎం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాజ్ భవన్‌కు ప్రమాణ స్వీకార సామగ్రిని తరలిస్తున్నారు. మూడు డీసీఎంలలో టెంట్లు, సౌండ్ సిస్టమ్స్, కుర్చీలు, రెడ్ కార్పెట్లు, ఫర్నీచర్‌ను తరలించారు.  రాజ్ భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News