Virat Kohli: కోహ్లీ ముఖం నిండా దెబ్బలు.. ముక్కుపై బ్యాండేజీ.. ఏం జరిగింది?.. ఆందోళనలో ఫ్యాన్స్

What Happened To Virat Kohli Face Bruises
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి ఏమైంది? ముఖం నిండా ఆ దెబ్బలేంటి? ముక్కుపై ఆ బ్యాండేజ్ ఏంటి? అభిమానులను ఇప్పుడీ ప్రశ్న వేధిస్తోంది. విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్న ఫొటో చూసి అభిమానులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఎడమ కన్ను కమిలిపోయి, కుడిచెంప, ఎడమవైపు నుదురుభాగంలో గాయం ఆ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తగిలించిన క్యాప్షన్‌లో ‘మీరు మరో కొత్త వ్యక్తిని చూస్తారు’ అని రాసుకొచ్చాడు.

ఈ ఫొటోపై అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇది మార్ఫింగ్ అని కొందరంటే, ‘అయ్యో కోహ్లీకి ఏమైంది?’ అని కొందరు ఆరా తీస్తున్నారు.  ప్రమాదమేమైనా జరిగిందా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే, అసలు ఏం జరిగిందన్న విషయంలో క్లారిటీ లేదు. మరి కోహ్లీనే దీనిపై స్పష్టత ఇస్తాడేమో చూడాలి.
Go Back to Shorts
Virat Kohli
Team India
Kohli Accident
Bruises
Kohli Black Eye

More Telugu News