టీడీపీ ఆధ్వర్యంలో బీసీల సమస్యలపై అఖిలపక్ష సమావేశం... నేతలు ఎవరేమన్నారంటే...!

17-11-2023 Fri 14:44 | Andhra
Advertisement
  • విజయవాడలో సమావేశం
  • టీడీపీ తరఫున హాజరైన అచ్చెన్నాయుడు, బుద్ధా వెంకన్న, కొల్లు రవీంద్ర
  • సీపీఐ రామకృష్ణ, జనసేన తరఫున పోతిన మహేశ్ హాజరు
Advertisement
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీసీల సమస్యలపై విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రౌండ్ టేబుల్ సమావేశం ఇన్చార్జి బుద్ధా వెంకన్న, టీడీపీ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు కొల్లు రవీంద్ర, సీపీఐ రామకృష్ణ, జనసేన నేత పోతిన మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

నేతల వ్యాఖ్యలు...

అచ్చెన్నాయుడు: నా ఎస్సీలు, నా బీసీలు అంటున్న జగన్ ఏంచేశారు? దళితులు, బీసీలసై దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారు? దాడులపై ఏ ఒక్క బీసీ మంత్రి అయినా స్పందించారా? రాష్ట్రాన్ని ఐదుగురు వ్యక్తులకు ధారాదత్తం చేశారు.
 
బుద్ధా వెంకన్న: జగన్ ప్రభుత్వం బీసీలను చూసి ఓర్వలేకపోతోంది. ఇవాళ్టి కార్యక్రమంలో అచ్చెన్నాయుడికి గద బహూకరించాం. ఎందుకంటే... చంద్రబాబు చేస్తున్న పోరాటానికి హనుమంతుడిలా వెంట ఉండి సాయపడుతున్నాడు. ఉత్తరాంధ్ర నుంచి ఇటు చిత్తూరు వరకు వైసీపీ శ్రేణులను తరిమి తరిమి కొడతాడని ఆయనకు గద ఇచ్చాం.

కొల్లు రవీంద్ర: బీసీలను మోసగించేందుకే వైసీపీ సామాజిక బస్సు యాత్ర చేపడుతోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి బీసీలు బుద్ధి చెబుతారు. 

సీపీఐ రామకృష్ణ: టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా. అదే సమయంలో సీపీఐ-సీపీఎం కూడా అసెంబ్లీలో ఉండాలి. ప్రశ్నించే గొంతుకలు ఉన్నప్పుడే అధికార పక్షం సక్రమంగా నడుస్తుంది. వైసీపీని నడిపించే నలుగురు కీలక నేతలు జగన్ సామాజిక వర్గానికి చెందినవారే. రాష్ట్రంలో పేరుకు మాత్రమే సామాజిక న్యాయం ఉంది. రాష్ట్ర ఆదాయాన్ని కొల్లగొట్టిన వీళ్లు ఇప్పుడు సామాజిక సాధికార యాత్ర అంటున్నారు.

పోతిన మహేశ్: జగన్ ముమ్మాటికీ బీసీ ద్రోహి. బీసీలపై వైసీపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 10 శాతం రిజర్వేషన్లను జగన్ తీసేశారు.
Advertisement
TDPAll Party MeetingBCVijayawadaCPIJanasenaAndhra Pradesh

More Telugu News

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30
..more