బీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి రాజీనామా
- ఈ నెల 31న ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన
- బీఆర్ఎస్‌లో తనకు అన్ని విధాలుగా సహకరించారని వెల్లడి
- కానీ స్థానిక సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన
గురువారం ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్‌లో తనకు అన్ని విధాలుగా సహకరించారని, కానీ స్థానిక సమస్యలను మాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపించారు.