కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ కార్డులకు రామప్ప ఆలయంలో పూజలు చేసిన రాహుల్, ప్రియాంక
- నేడు ములుగులో కాంగ్రెస్ ఎన్నికల సభ
- హాజరైన రాహుల్ గాంధీ, ప్రియాంక
- సభకు వచ్చే ముందు రామప్ప ఆలయ సందర్శన
కాగా, ఈ సభకు వచ్చే ముందు రాహుల్, ప్రియాంక ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో తమ ప్రచార అస్త్రాలుగా పేర్కొంటున్న ఆరు గ్యారెంటీ కార్డులను రామప్ప ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ములుగు సభకు బయల్దేరారు. 1.మహాలక్ష్మి 2. రైతు భరోసా 3. గృహజ్యోతి 4. ఇందిరమ్మ ఇళ్లు 5. యువ వికాసం 6. చేయూత గ్యారెంటీలను ఇటీవల కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

