సైబర్ నేరగాళ్ల భారీ స్కెచ్! పేమెంట్ గేట్‌వే సంస్థ నుంచి రూ.16 వేల కోట్ల చోరీ
- హ్యాకర్లు రూ.25 కోట్లు తస్కరించారంటూ థానే పోలీసులకు ఓ చెల్లింపుల సంస్థ ఫిర్యాదు
- దర్యాప్తు సందర్భంగా వెలుగులోకొచ్చిన భారీ మొత్తం
- ఇప్పటివరకూ హ్యాకర్లు రూ.16 వేల కోట్లు దొంగిలించినట్టు గుర్తించిన పోలీసులు
- ఐదుగురిపై కేసు నమోదు, నిందితుల నుంచి ఫోర్జరీ డాక్యుమెంట్ల స్వాధీనం
ఈ క్రమంలో ఐదుగురిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, కేసులో నిందితుడిగా ఉన్న జితేంద్ర సింగ్ గతంలో పదేళ్ల పాటు వివిధ బ్యాంకుల్లో రిలేషన్‌షిప్, సేల్స్ మేనేజర్‌గా పనిచేసినట్టు పోలీసులు గుర్తించారు.
కాగా, ఈ భారీ మోసంలో వివిధ వ్యక్తుల పాత్ర ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన పర్యవసానాలు దేశవ్యాప్తంగా ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. వివిధ కంపెనీలు, వ్యక్తులు నిందితుల బారిన పడి ఉండొచ్చని అంటున్నారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం, ఈ సైబర్ స్కామ్‌లో వేల అకౌంట్ల మధ్య నగదు బదిలీ జరిగింది. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల వద్ద ఫోర్జరీ చేసిన పలు డాక్యుమెంట్లు కూడా పోలీసులకు లభించాయి. అయితే, ఈ కేసులో ఇప్పటివరకూ పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.