'ఇంద్ర' నటి ప్రశాంతి కుమార్తె డాన్స్ వీడియోకి అరుదైన గౌరవం

Tanya Harathi dance video gets accolades
  • మ్యూజిక్ వీడియో రూపొందించిన తాన్యా హారతి
  • తాన్యా హారతి నటి ప్రశాంతి హారతి కుమార్తె
  • తాన్యా వీడియోను తన యూట్యూబ్ చానల్ లో ప్రదర్శించిన దర్శకుడు రాఘవేంద్రరావు
  • ఒక మిలియన్ కు పైగా వ్యూస్ సాధించిన మ్యూజిక్ వీడియో
కేఆర్ఆర్ వర్క్స్ యూట్యూబ్ ఛానెల్‌లో పది లక్షలకు పైగా వ్యూస్ సాధించిన 'తెలుగింటి సంస్కృతి' డాన్స్ వీడియో విజయోత్సవ వేడుకలు టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో అక్టోబర్ 1వ ఘనంగా జరిగాయి. ఈ విజయానికి దోహదపడిన దర్శకులు వి.ఎన్.ఆదిత్యకు నిర్మాత రాధాకృష్ణ హారతి  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

ఇంద్ర, పెళ్లాం ఊరెళితే వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన ప్రఖ్యాత సినీ కళాకారిణి ప్రశాంతి హారతి ఈ డాన్స్ వీడియోలో మంత్రముగ్ధులను చేసేలా కొరియోగ్రఫీ చేసి ఒక ముఖ్యమైన పాత్ర వహించారు. చిన్నప్పటి నుంచి తన తల్లి నుండి కూచిపూడి నృత్య కళను నేర్చుకున్న ఆమె కుమార్తె తాన్యా హారతి ఈ మ్యూజిక్ వీడియో రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. కిరణ్ గుడిపల్లి కూడా ఒక ముఖ్యమైన పాత్ర వహించారు. 

శ్యామ్ కట్రు, పృథ్వీ తేజ, కమల్ నందికొండ తదితరులతో కూడిన ప్రతిభావంతులైన కెమెరా బృందం, డాన్స్ వీడియోలోని ప్రతి క్షణాన్ని కళాత్మకంగా తెరకెక్కించారు. ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ KRRWorksలో ప్రదర్శించినందుకు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారికి టీమ్ తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.  

FISD (ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్) వైస్ ప్రెసిడెంట్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అయిన గోపాల్ పొనంగి గారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మ్యూజిక్ వీడియో బృందం ధన్యవాదాలు తెలియజేసింది. కాగా, డ్యాన్స్ వీడియోకు ఎస్ఏ ఖుద్దూస్ సంగీతం అందించారు.
Go Back to Shorts
Tanya Harathi
Prashanthi Harathi
Dance Video
KRR Works

More Telugu News