మీరే జైల్లో చంద్రబాబుకు హాని తలపెడతారనే అనుమానం కలుగుతోంది: విజయసాయిరెడ్డి

మీరే జైల్లో చంద్రబాబుకు హాని తలపెడతారనే అనుమానం కలుగుతోంది: విజయసాయిరెడ్డి

There is a suspicion that you will harm Chandrababu in jail says Vijayasai Reddy
  • బాబు పదవి కొట్టేయాలన్న కసి కొందరు టీడీపీ నేతల్లో కనిపిస్తోందన్న విజయసాయి
  • జైలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
  • జైల్లో ఫ్యాన్ వాడరాదన్న నియమం ఏమీ లేదని వ్యాఖ్య
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, జైల్లో ఆయనకు సరైన భద్రత లేదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జైల్లో ఆయనకు హాని తలపెట్టే అవకాశాలు ఉన్నాయని టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మీ వ్యవహారం చూస్తుంటే... మీరు, మీ పార్టీ వారే జైల్లో ఉన్న చంద్రబాబుకు హాని తలపెడతారనే అనుమానం కలుగుతోందని అన్నారు. బాబుకు వెన్నుపోటు పొడిచి, ఆయన పదవిని కొట్టేయాలన్న కసి కొందరు టీడీపీ నేతల్లో కనిపిస్తోందని చెప్పారు. టీడీపీ వారితో జైలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

'వైఎస్సార్సీపీ గుర్తు ఫ్యాన్ అయినంత మాత్రాన జైల్లో ఫ్యాన్ వాడరాదన్న నియమం ఏమీలేదు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఫ్యాన్ తీసేసి నాకు ఏసీ కావాలని పట్టుబట్టినా జైలు నిబంధనలు అందుకు అనుమతించవు. స్విచ్ వేయకుండా ఫ్యాన్ తిరగడం లేదంటే ఎలా?' అని మరో ట్వీట్ చేశారు.
Advertisement
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News