బాలకృష్ణకు అసెంబ్లీ షూటింగ్ స్పాట్‌లా కనిపిస్తోందా?: మంత్రి రోజా ఆగ్రహం

21-09-2023 Thu 15:32 | Andhra
Advertisement
  • చంద్రబాబుపై పెట్టినవి అక్రమ కేసులని టీడీపీ భావిస్తే మాట్లాడేందుకు సమయం అడగాలని సూచన
  • సభలోనే రండిరా కొట్టుకుందామన్నట్లుగా ప్రవర్తిండమేమిటని ప్రశ్న
  • బావ కళ్లలో ఆనందం కోసమే మీసాలు మెలేసినట్లుగా ఉందన్న రోజా
Advertisement
టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై ఆమె మాట్లాడుతూ... అసెంబ్లీ అంటే బాలకృష్ణకు షూటింగ్ స్పాట్‌లా కనిపిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. సభలోనే ఆయన మీసాలు తిప్పడం చూస్తుంటే దానిని షూటింగ్ స్పాట్‌గా భావిస్తున్నట్లుగా అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై పెట్టినవి అక్రమ కేసులు అని వారు భావిస్తే కనుక సభాపతిని మాట్లాడేందుకు సమయం అడగాలని సూచించారు.

కానీ సభలోనే రండిరా కొట్టుకుందామన్నట్లుగా మాట్లాడారని, దీనిని మనం వీడియోలో (నేటి అసెంబ్లీ వీడియోలు)  చూసినా అర్థమవుతుందన్నారు. టీడీపీ అధినేత అరెస్ట్‌పై మాట్లాడేందుకు టీడీపీ నేతలకు సమయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ రూల్ ప్రకారం కాకుండా రౌడీయిజం చేస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు.

బావ కళ్లలో ఆనందం కోసమే...

పబ్లిసిటీ కోసమే టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారని రోజా మండిపడ్డారు. టీడీపీ నేతలు ఫైల్స్ విసిరి, బాటిల్స్ పగులగొట్టి నానా హంగామా సృష్టించారన్నారు. సభా మర్యాదను అగౌరవపరిచేలా బాలకృష్ణ ప్రవర్తన ఉందన్నారు. బావ కళ్లలో ఆనందం చూసేందుకు మీసాలు మెలేసినట్లుగా ఉందన్నారు. టీడీపీ అధినేత అవినీతి చేసి దొరికిపోయిన దొంగ అన్నారు. అసలు ఈ తొమ్మిదేళ్లలో బాలకృష్ణ ఎన్నేళ్లు సభకు వచ్చారో చెప్పాలన్నారు. తనకు ఓటేసి గెలిపించిన హిందూపురం ప్రజల సమస్యల కోసం ఏనాడైనా సభలో మాట్లాడారా? అని నిలదీశారు. చంద్రబాబు ప్రజల డబ్బును దోచి అరెస్టయ్యాడని, అక్రమ సొమ్మును బయటకు తీస్తామన్నారు. దమ్ముంటే బాలకృష్ణ చర్చకు సిద్ధమై రావాలని, ఎంతసేపైనా చర్చించేందుకు తాము సిద్ధమన్నారు.
Advertisement
RojaBalakrishnaAndhra PradeshAP Assembly Session

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more