తిరుమల నడక దారిలో లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే చిక్కిన మరో చిరుత
- నమూనాను ల్యాబ్‌కు పంపించనున్న అధికారులు
- ఆగస్టు 11న చిన్నారి లక్షితపై దాడి చేసి చంపిన చిరుత
- అప్పటి నుంచి ఏడు చిరుతలను బంధించిన అధికారులు
ఈ చిరుత నమూనాని సైతం అధికారులు ల్యాబ్‌కి పంపనున్నారు. మరోవైపు అలిపిరి కాలిబాట మార్గంలో ఆపరేషన్ చిరుత ఇంకా కొనసాగుతూనే ఉంది. మూడు నెలల వ్యవధిలో అలిపిరి నడక మార్గంలో ఏడు చిరుతలను అటవీ అధికారులు బంధించారు. కాగా, ఆగస్ట్11వ తేదీన అలిపిరి కాలిబాట మార్గంలోని నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో అరేళ్ళ బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపేసింది.