అభ్యంతరం ఉంటే విచారణను వేరే బెంచ్ కు బదిలీ చేస్తానన్న జడ్జి.. అభ్యంతరం లేదన్న చంద్రబాబు లాయర్
- గతంలో తాను పీపీగా పని చేశానన్న జడ్జి
- తనపై అభ్యంతరం ఉంటే చెప్పాలని అడిగిన వైనం
- అభ్యంతరం లేదని చెప్పడంతో విచారణను కొనసాగించిన జడ్జి
మరోవైపు, కోర్టులో చంద్రబాబుకు అత్యవసర ఊరట లభించలేదు. క్వాష్ పిటీషన్ పై విచారణను మంగళవారం వరకు హైకోర్టు వాయిదా వేయడంతో... మరో ఆరు రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండబోతున్నారు. మరోవైపు చంద్రబాబును సోమవారం వరకు కస్టడీలోకి తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో, ఆయనకు కొంత ఊరట లభించినట్టయింది.