Naslen K. Gafoor: సోనీ లివ్ కి మరో టీనేజ్ లవ్ స్టోరీ .. 'జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్'

Journey of love 18 plus movie streaming date confirmed
షార్ట్స్‌లో చూడండి
'సోనీ లివ్' వైవిధ్యభరితమైన కథలతో కూడిన సినిమాలను .. వెబ్ సిరీస్ లను అందిస్తూ, వినోద ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటోంది. చిన్న సినిమాలే అయినా మంచి కంటెంట్ ఉన్నవాటికి ప్రాధాన్యతనిస్తూ, తమ ప్రత్యేకతను చాటుకుంటోంది. అలా ఈ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తున్న సినిమానే 'జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్'.

నస్లీన్ కె గఫూర్ .. మాథ్యూ థామస్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, అరుణ్ డి జోస్ దర్శకత్వం వహించాడు. ఇది టీనేజ్ లవ్ స్టోరీ .. రొమాన్స్ తో కూడిన కామెడీ డ్రామా. మలయాళంలో జులై 7వ తేదీన విడుదలైన ఈ సినిమా, సింపుల్ కంటెంట్ తో అక్కడి యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది.

అలాంటి ఈ సినిమాను ఈ నెల 15వ తేదీ నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఓటీటీలో వచ్చిన 'నెయిమర్' సినిమాతో, మిగతా భాషల వారికి కూడా నస్లీన్ - మాథ్యూ పరిచయమయ్యారు. అందువలన సహజంగానే ఈ సినిమాపై ఆసక్తి ఉంది. ఇతర పాత్రల్లో మీనాక్షి .. నిఖిలా విమల్ .. బినూ పప్పు కనిపించనున్నారు. ఓటీటీ ప్రేక్షకులకు ఈ సినిమా ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందనేది చూడాలి. 
Go Back to Shorts
Naslen K. Gafoor
Mathew Thomas
Nikhila Vimal
Journey of Love 18+

More Telugu News