రామ్–బోయపాటి స్కంద వెనక్కి.. సలార్ టైమ్‌కి విడుదల
- ఈ నెల 15న విడుదల కావాల్సిన స్కంద
- ప్రభాస్ సలార్ వాయిదా పడటంతో వెనక్కి జరిపిన చిత్ర బృందం
- ఈ నెల 28న స్కందను విడుదల చేస్తున్నట్టు ప్రకటన
రెబల్ స్టార్ ప్రభాస్–ప్రశాంత్ నీల్ చిత్రం సలార్ వాయిదా పడటంతో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందకు స్కంద రిలీజ్ డేట్‌ను వెనక్కు జరిపారు. ‘సలార్’ రిలీజ్ అవ్వాల్సిన ఈ నెల 28వ తేదీన స్కందను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు.