బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టిన శివాజీ

Sivaji enters into Bigg Boss house
  • బిగ్ బాస్ ఏడో సీజన్ ప్రారంభం
  • హోస్ట్ గా నాగార్జున
  • ఇప్పటివరకు బిగ్ బాస్ ఇంట్లోకి నలుగురు కంటెస్టెంట్లు
చాన్నాళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న నటుడు శివాజీ బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టాడు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్-7లో శివాజీ రెండో కంటెస్టెంట్. బద్రి చిత్రంలోని బంగాళాఖాతంలో... పాట పాడుతూ బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించిన శివాజీకి తొలి కంటెస్టెంట్ ప్రియాంక జైన్ వెల్కమ్ చెప్పింది. 

ఆ తర్వాత మూడో కంటెస్టెంట్ గా సింగర్ దామిని భట్ల హౌస్ లోకి ఎంటరైంది. నాలుగో కంటెస్టెంట్ గా మోడల్ ప్రిన్స్ యావర్ ప్రవేశించాడు. బిగ్ బాస్ వేదికపై ప్రిన్స్ యావర్ తో హోస్ట్ నాగార్జున సంభాషణ ఆకట్టుకుంది. యావర్ ఎనర్జీ చూసి నాగ్ ఆశ్చర్యపోయారు. యావర్ తన బాడీ చూపిస్తూ చొక్కా తీసేసి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టడం విశేషం.
Go Back to Shorts
Sivaji
Bigg Boss-7
Actor
Nagarjuna

More Telugu News