అనర్హులకు, బీఆర్​ఎస్​ వాళ్లకే డబుల్​ బెడ్రూంలు ఇస్తున్నారు: రాజాసింగ్​ విమర్శలు

అనర్హులకు, బీఆర్​ఎస్​ వాళ్లకే డబుల్​ బెడ్రూంలు ఇస్తున్నారు: రాజాసింగ్​ విమర్శలు

MLA Raja Singh fires on BRS govt over 2BHK scheme
  • ఎన్నికల ముందు కేసీఆర్ ప్రభుత్వం తమాషాలు చేస్తోందని ఆగ్రహం
  • డబుల్ బెడ్రూంలు నిర్మించడంలో విఫలమైందని ఆరోపణ
  • రాష్ట్రం మత్తుల తెలంగాణగా మారిందన్న రాజా సింగ్
బీఆర్ఎస్ ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు కేసీఆర్ సర్కార్ తమాషాలు చేస్తోందని విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు నిర్మించటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అర్హులను కాదని, అనర్హులు, బీఆర్ఎస్ వాళ్ళకే డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇస్తున్నారన్నారు. గోషామహాల్ నియోజకవర్గంలో అర్హత లేని అనేక మందికి ఇళ్ళు ఇచ్చారని రాజాసింగ్ పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులతో నిర్మించారన్నారు. కానీ, తామే నిర్మించినట్లు బీఆర్ఎస్ చెబుతోందన్నారు. ఇక కేసీఆర్ హయాంలో రాష్ట్రం మత్తుల‌ తెలంగాణగా మారిందని రాజా సింగ్ ఆరోపించారు
Advertisement
Raja Singh
BRS
2bhk
KCR

More Telugu News