'సూపర్ బ్లూమూన్'గా చంద్రుడి అరుదైన దృశ్యం
- ఒకే నెలలో రెండోసారి కనిపించే సూపర్ బ్లూమూన్
- ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 30, 31 తేదీల్లో బ్లూమూన్‌గా చంద్రుడు
- భారత్‌లో రేపు ఉదయం 7 గంటలకు గరిష్ఠస్థాయికి బ్లూమూన్
పౌర్ణమి సమయంలో చందమామ భూమికి దగ్గరగా రావడాన్ని సూపర్ మూన్‌గా చెబుతారు. సాధారణ పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రుడు సాధారణ పరిమాణం కంటే ఏడు శాతం పెద్దగా, పదహారు శాతం ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అయితే బ్లూమూన్ అన్నంత మాత్రాన మరీ నీలిరంగులో కనిపించదు. గతంలో 1940లో, ఆ తర్వాత 2018లో బ్లూమూన్ కనిపించింది. ఇప్పుడు మరలా కనిపించిన ఈ సూపర్ బ్లూమూన్ మళ్లీ 2037లో కనిపించనుంది.