ఢిల్లీ సాక్షిగా కుట్రలు చేయడం మీ మరిది గారికి అలవాటే: పురందేశ్వరిని ఉద్దేశిస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్
- జేపీ నడ్డాతో బాబు మాట్లాడుతున్న ఫోటోను ట్వీట్ చేసి పురందేశ్వరికి హెచ్చరిక!
- పురందేశ్వరిని తీసుకెళ్ళి అమ్మే ప్రయత్నం చేయడం హైలైట్ అని ఎద్దేవా
- మీరంతా ఒకటేనని బీజేపీకు తెలుసునని వ్యాఖ్య
ఢిల్లీ సాక్షిగా కుట్రలు చేయడం మీ మరిది గారికి అలవాటేనని పురందేశ్వరిని ఉద్దేశించి అన్నారు. కానీ ఈసారి మిమ్మల్ని తీసుకెళ్లి అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు చూడండి... అదీ హైలైట్ అని పేర్కొన్నారు. చంద్రబాబు జీవితంలో ఎవ్వరికీ విశ్వసనీయమైన స్నేహితుడు కాలేడన్న కమ్మటి వాస్తవం ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరికీ తెలుసునన్నారు.
ఇంతకంటే ఆధారం కావాలా? చిన్నమ్మా! పురందేశ్వరి! పతీసమేతంగా మరిదిని తీసుకెళ్లి మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఇష్టంలేకపోయినా బలవంతంగా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకి తెలీదా, మీరంతా ఒకటేనని, అందుకే కదా దొంగ చేతికే తాళం ఇచ్చిందని వ్యాఖ్యానించారు.