ఖమ్మంలో అమిత్ షా సభలో తిరుమలను కాపాడాలంటూ ప్లకార్డులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఖమ్మంలో అమిత్ షా సభలో తిరుమలను కాపాడాలంటూ ప్లకార్డులు

Amit Shah attends BJP rally in Khammam
  • ఖమ్మంలో బీజేపీ సభ
  • హాజరైన అమిత్ షా
  • సేవ్ తిరుమల సేవ్ టీటీడీ ప్లకార్డులు ప్రదర్శించిన వ్యక్తులు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం చేరుకున్నారు. రైతు గోస-బీజేపీ భరోసా సభ వేదిక వద్ద ఆయనకు తెలంగాణ బీజేపీ అగ్రనేతలు స్వాగతం పలికారు. కాగా, అమిత్ షా సభలో తిరుమలను కాపాడాలంటూ ప్లకార్డులు దర్శనమిచ్చాయి. కొందరు వ్యక్తులు సేవ్ తిరుమల, సేవ్ టీటీడీ అనే ప్లకార్డులను ప్రదర్శించారు. 

అమిత్ షా ఈ మధ్యాహ్నం ఏపీలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోగా, అక్కడే ఏపీ బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అమిత్ షా కొద్దిసేపు ఏపీ బీజేపీ నేతలతో మాట్లాడారు. అమిత్ షాకి స్వాగతం పలికిన వారిలో ఏపీ బీజేపీ మీడియా ఇన్చార్జి పాతూరి నాగభూషణం, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్ తదితరులు ఉన్నారు.
Advertisement
Amit Shah
Placards
Save Tirumala
Save TTD
Khammam
BJP
Telangana

More Telugu News