ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్ గా టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్
- భారత ఐటీ దిగ్గజంతో చేయి కలిపిన స్పెయిన్ టెన్నిస్ స్టార్
- ఇన్ఫోసిస్ కు మూడేళ్ల పాటు ప్రచారకర్తగా వ్యవహరించనున్న నాదల్
- ఎంతో సంతోషంగా ఉందన్న టెన్నిస్ ఐకాన్
ఓ సాఫ్ట్ వేర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం నాదల్ కు ఇదే ప్రథమం. ఈ ఒప్పందంలో భాగంగా ఇన్ఫోసిస్, నాదల్ కోచింగ్ టీమ్ కృత్రిమ మేథతో కూడిన మ్యాచ్ అనాలిసిస్ టూల్ ను కూడా అభివృద్ధి చేయనున్నారు.
దీనిపై నాదల్ స్పందించాడు. ఇన్ఫోసిస్ తో కలవడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించాడు. ఇప్పుడు తాను ఇన్ఫోసిస్ గ్లోబల్ అంబాసిడర్ నని తెలిపాడు. తమ భాగస్వామ్యం ఎంతో ఆహ్లాదకరంగా ముందుకు సాగుతుందని భావిస్తున్నానని నాదల్ పేర్కొన్నాడు.