Prakash Raj: చంద్రయాన్-3ని అపహాస్యం చేస్తూ పోస్ట్ పెట్టిన నేపథ్యంలో ప్రకాశ్ రాజ్‌పై కేసు నమోదు

Police complaint against Prakash Raj for objectionable Chandrayaan tweet
షార్ట్స్‌లో చూడండి
సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై కర్ణాటకలోని బాగల్‌కోట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. చంద్రయాన్-3పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. చంద్రయాన్ ఇప్పుడే పంపిన ఫోటో అంటూ టీ వడపోస్తున్న ఒక వ్యక్తి కార్టూన్‌ను ఆయన పోస్ట్ చేశాడు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ హిందూ సంస్థ నాయకుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగాన్ని అపహాస్యం చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

చంద్రయాన్-3పై సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు సంబంధించి ఫిర్యాదు అందిందని, ఈ మిషన్‌పై అభ్యంతరకర ట్వీట్ చేసినందుకు చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేశారని బాగల్‌కోట్‌లోని బనహట్టి పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Prakash Raj
Chandrayaan-3
Karnataka
ISRO

More Telugu News