తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీల్లో రేపు చంద్రయాన్-3 లైవ్ స్ట్రీమింగ్
- ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ అధికారులు
- ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఏర్పాట్లు
- గవర్నమెంట్ స్కూళ్లలో ప్రత్యేక తెరలపై ప్రత్యక్ష ప్రసారం
చంద్రయాన్-3 ల్యాండింగ్ ను లైవ్ లో అందించేందుకు భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. విద్యార్థులు, యువత దీనిని చూడాలని విజ్ఞప్తి చేసింది. చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రార్థించాలని దేశ ప్రజలను కోరింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.