ఎంపీ కేశినేని నానిపై వైసీపీ ఎమ్మెల్యే ప్రశంసలు
- ప్రజలకు సేవ చేయడం వల్లే కేశినేని గెలిచారన్న మొండితోక జగన్‌మోహన్
- ఆయనతో తమకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని వెల్లడి
- ఓ వ్యక్తిగా కేశినేని నాని మంచి వారని వ్యాఖ్య
‘‘వ్యక్తిగా కేశినేని నాని మంచి వారు. ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట.. ఆయన ఎంపీగా గెలిచారు. ప్రజలకు సేవ చేయబట్టే ఆయన విజయం సాధించారు” అని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఎవరి వెసులుబాటును బట్టి వాళ్లు మాట్లాడుతారని అన్నారు. ప్రజా సమస్యల విషయంలో ఆయన్ను అడగడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ప్రజల కోసం తాను ఎవరితోనైనా పని చేస్తానని చెప్పారు.