3 రోజుల్లో 2 వేల దరఖాస్తులు.. తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్లకు భారీ స్పందన
- ఎన్నికల సమయం కావడంతో విపరీతమైన పోటీ
- రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో టెండర్లకు భారీ స్పందన
- నాన్ రిఫండబుల్ ఫీజు కింద ప్రభుత్వ ఖజానాకు భారీగా సమకూరనున్న ఆదాయం
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయని అధికారులు చెప్పారు. ముఖ్యంగా కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ లో మద్యం షాపుల టెండర్లకు చాలామంది పోటీపడుతున్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం షాపులు ఉండగా.. ఇప్పటికే 2 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, రాబోయే రోజుల్లో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 18 సాయంత్రం 6 గంటలకు టెండర్ దాఖలు గడువు ముగుస్తుందని, 21న లాటరీ విధానంలో మద్యం షాపులు కేటాయిస్తామని అధికారులు వివరించారు.