నారా లోకేశ్ ను 'సారా లోకేశ్'గా అభివర్ణించిన కాసు మహేశ్

నారా లోకేశ్ ను 'సారా లోకేశ్'గా అభివర్ణించిన కాసు మహేశ్

Kasu Mahesh called Nara Lokesh as Sara Lokesh
  • గురజాలకు టీడీపీ చేసిందేమిటో చెప్పాలని కాసు మహేశ్ డిమాండ్
  • టీడీపీ కార్యాలయంలో చర్చ పెట్టినా వస్తానని సవాల్
  • గురజాలకు అన్నీ తామే చేసుకున్నామని వ్యాఖ్య
తన గురజాల నియోజకవర్గంలో గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో ఎంతో అభివృద్ధి జరిగిందని.. దీనిపై టీడీపీ కార్యాలయంలో చర్చ పెట్టినా తాను చర్చకు వస్తానని ఛాలెంజ్ చేశారు. సారా అమ్మకాలతో వచ్చిన డబ్బులతో జూబ్లీహిల్స్ లో చంద్రబాబు రూ. 300 కోట్లతో ఇంటిని నిర్మించారని.. అందుకే నారా లోకేశ్ ను సారా లోకేశ్ అంటారని విమర్శించారు. గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న సారా లోకేశ్ శ్మశానాలు, మరుగుదొడ్లను నిర్మిస్తానని చెప్పి కోట్లు మింగేశారని ఆరోపించారు. ప్రజాధనాన్ని దోచుకున్న యరపతినేని గుంటూరులో రూ. 50 కోట్లతో ఇల్లు కట్టారని విమర్శించారు. గురజాల ప్రాంతంలో మెడికల్ కాలేజీ, బైపాస్ రోడ్డు, ఇంటింటికీ తాగునీరు అన్నీ తామే చేసుకున్నామని చెప్పారు.
Advertisement
Kasu Mahesh Reddy
YSRCP
Nara Lokesh
Telugudesam

More Telugu News