మణిపూర్‌లో మళ్లీ హింస.. బిష్ణుపూర్‌లో ముగ్గురి మృతి.. తగలబడుతున్న ఇళ్లు
- గత రాత్రి జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మెయిటీల మృతి
- కుకీల ఇళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
- మొన్న జరిగిన గొడవల్లో 17 మందికి గాయాలు
- మణిపూర్ ఘర్షణల్లో ఇప్పటి వరకు 160 మందికిపైగా మృతి
ఇదే జిల్లాలో రెండ్రోజుల క్రితం మెయిటీ తెగ ప్రజలు, సాయుధ బలగాల మధ్య జరిగిన గొడవల్లో 17 మంది గాయపడ్డారు. తమపైకి దూసుకొచ్చిన ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు, సాయుధ బలగాలు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాయి. కాగా, మణిపూర్‌లో దాదాపు 3 నెలలుగా జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయపడ్డారు.