'SSS' పేరుతో అంబటి రాంబాబుపై సినిమా.. ముహూర్తపు షాట్ చిత్రీకరించిన తిరుపతి జనసేన నేతలు
- వైసీపీ, జనసేన మధ్య చిచ్చు రాజేసిన 'బ్రో'
- 'సందులో సంబరాల శాంబాబు' సినిమా ముహూర్తపు షాట్ తీసిన జనసేన
- హీరోయిన్లను రెడ్ లైట్ ఏరియా నుంచి తెస్తామని వ్యాఖ్య
ఈ సందర్భంగా మీడియాతో జనసేన నేతలు మాట్లాడుతూ... 'SSS' అంటే సందులో సంబరాల శాంబాబు అని అర్థమని చెప్పారు. ఈ సినిమాలో హీరోయిన్స్ ని ముంబై రెడ్ లైట్ ఏరియా నుంచి కానీ కోల్ కతా చాందినీ గంజ్ నుంచి కానీ తీసుకొస్తామని తెలిపారు. జగ్గూభాయ్ సమర్పణలో చిత్రాన్ని నిర్మిస్తామని చెప్పారు. నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడకుండా తమ అధినేత పవన్ గురించి మాట్లాడితే... రాబోయే రోజుల్లో 'XXX రాంబాబు' అనే సినిమా కూడా తీస్తామని హెచ్చరించారు.