హాలిడేకు వచ్చినట్లు ఏపీకి వచ్చి రైతులపై కల్లబొల్లి ప్రేమను కనబరుస్తున్నారు: చంద్రబాబుపై రోజా విమర్శలు
- వ్యవసాయం దండగ అన్న వ్యక్తిని నమ్మరన్న రోజా
- చంద్రబాబు రైతుల జీవితాలను నాశనం చేశారని ఆరోపణ
- 'చంద్రబాబు, కరవు కవలలు' అంటూ ఎద్దేవా
ఇదిలా ఉండగా, రోజా గుడివాడ నియోజకవర్గస్థాయి సమీక్షలో పాల్గొన్నారు. ఆమె కృష్ణా జిల్లాకు ఇంఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కొడాలి నాని హాజరయ్యారు. నియోజకవర్గంలో అన్ని పభుత్వ శాఖలు సమీక్షించామని, అభివృద్ధి పనులపై సమీక్షించి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు తెలుసుకున్నామని రోజా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. గుర్తించిన సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా, నియోజకవర్గ అధికారులకు తెలియజేసి, తగు పరిష్కారాలకై చర్చించి తగు సలహాలు సూచనలు చేసి ప్రతి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆదేశించినట్లు తెలిపారు.