Helicopter Missing: నేపాల్‌లో టేకాఫ్ అయిన కాసేపటికే అదృశ్యమైన హెలికాప్టర్

Chopper with 6 people on board missing in Nepal
షార్ట్స్‌లో చూడండి
ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్ అదృశ్యమైంది. నేపాల్‌లో జరిగిందీ ఘటన. మేనేజింగ్ ఎయిర్‌కు చెందిన హెలికాప్టర్ 9ఎన్-ఏఎంవీ (ఏఎస్ 50) సోలుకుంబు నుంచి ఖఠ్మాండు వెళ్తుండగా చాపర్ అదృశ్యమైంది. హెలికాప్టర్‌లో పైలట్‌తోపాటు ఐదుగురు విదేశీయులు ఉన్నారు. ఈ ఉదయం 10.12 గంటలకు అది రాడార్ నుంచి అదృశ్యమైంది. 

హెలికాప్టర్ అదృశ్యం కాగానే రంగంలోకి దిగిన అధికారులు దానిని వెతికేందుకు ఓ హెలికాప్టర్‌ను పంపారు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన 15 నిమిషాలకే దానితో సంబంధాలు తెగిపోయాయని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వివరించింది.
Go Back to Shorts
Helicopter Missing
Nepal
Solukhumbu
Kathmandu

More Telugu News