అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి భారీ పేలుడు.. ఇద్దరి మృతి
- సాహితీ ఫార్మాలో పేలిన రియాక్టర్లు?
- ఘటనలో మరికొందరికి గాయాలు
- భారీ శబ్దాలు రావడంతో పరుకులు పెట్టిన ఉద్యోగులు, కార్మికులు
భారీ శబ్దాలు రావడంతో ఉద్యోగులు, కార్మికులు, స్థానికులు భయంతో దూరంగా పరుగులు పెట్టారు. ఘటన గురించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. మరికొన్ని ఫైరింజన్లను రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గత జనవరిలో కూడా లాలంకోడూరు సమీపంలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.