ఎన్టీఆర్ అభిమాని శ్యామ్‌ది హత్యే... వీడియోలో మరొకరు ఉన్నారు: టీడీపీ ఆరోపణ
- శ్యామ్ మృతిపై వీడియో క్లిప్పింగ్స్ ప్రదర్శించిన టీడీపీ
- అనుమానాస్పద మృతి వెనుక ఎవరో ఉన్నారని వెల్లడవుతోందన్న వర్ల
- పోస్టుమార్టం చేసిన డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వకుండానే ఆత్మహత్య అని ఎలా చెప్పారని ప్రశ్న
శ్యామ్ మరణంపై దర్యాఫ్తు పూర్తికాకముందే పోలీసులు ఆత్మహత్య అని ఎలా చెబుతారని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. పోస్టుమార్టం చేసిన డాక్టర్... సర్టిఫికెట్ ఇవ్వకముందే శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం సరికాదన్నారు. బయటకు వచ్చిన శ్యామ్ సూసైడ్ వీడియో ఒరిజినల్ కాదన్నారు.
అది వైసీపీ సోషల్ మీడియా ఎడిట్ చేసిన వీడియో అని ఆరోపించారు. ఆ వీడియోలో శ్యామ్ మాట్లాడుతున్నప్పుడు అతనితో పాటు మరో వ్యక్తి ఉన్నారన్నారు. పూర్తి విచారణ చేయకుండానే వ్యక్తిగత కారణాలతో శ్యామ్ ఉరేసుకున్నాడని పోలీసులు ఎలా చెప్పారని నిలదీశారు. పోలీసులతో అలా చెప్పించిన వైసీపీ నేతలు ఎవరో చెప్పాలన్నారు.