రిఫండ్ కోసం... హైదరాబాద్‌లో రూ.40 కోట్ల భారీ ఐటీ కుంభకోణం

29-06-2023 Thu 15:45 | Both States
Advertisement
  • రిఫండ్ పొందేందుకు బోగస్ డాక్యుమెంట్లు, తప్పుడు కారణాలు చూపించినట్లు గుర్తింపు
  • ఈ స్కాం వెనుక 8 మంది ట్యాక్స్ కన్సల్టెంట్లతో పాటు రైల్వే, పోలీస్ శాఖ ఉద్యోగుల పాత్ర
  • విజయవాడ, హైదరాబాద్‌లలోని పలు ఐటీ కంపెనీలలో సోదాలు
Advertisement
హైదరాబాద్ లో భారీ ఐటీ కుంభకోణం బయటపడింది. రూ.40 కోట్ల ఆదాయపు శాఖ పన్ను రిఫండ్ కుంభకోణాన్ని ఐటీ అధికారులు గురువారం వెలుగులోకి తెచ్చారు. ఐటీ రిఫండ్ పొందేందుకు బోగస్ డాక్యుమెంట్లు, తప్పుడు కారణాలు చూపించినట్లు ఐటీ అధికారుల సోదాల్లో బయటపడింది. ఈ కుంభకోణం వెనుక 8 మంది ట్యాక్స్ కన్సల్టెంట్స్‌తో పాటు రైల్వే, పోలీస్ శాఖలకు చెందిన పలువురు ఉద్యోగుల పాత్రను గుర్తించారు.

ఈ మేరకు హైదరాబాద్, విజయవాడల్లోని పలు ఐటీ కంపెనీలలో అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లోని ఎల్బీనగర్, వనస్థలిపురం, నిజాంపేటలోని ఐటీ కన్సల్టెంట్స్‌లో సోదాలు చేశారు. ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసి విచారణ జరపనున్నారు. ఏజెంట్ల రిఫండ్ మొత్తంపై పది శాతం కమీషన్ కోసం ఐటీ కన్సల్టెంట్లు తప్పుడు రిటర్న్స్ దాఖలు చేసి, ఆ తర్వాత రిఫండ్ పొందేందుకు తప్పుడు డాక్యుమెంట్లు చూపించారని తెలింది.

2017లో ఇదే తరహాలో మోసాన్ని గుర్తించిన ఐటీ అధికారులు 200 మంది సాఫ్టువేర్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల్లో ఉన్న వైకల్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాల ద్వారా తప్పుడు రిఫండ్స్ క్లెయిమ్ చేసినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు అర్హత లేకపోయినా కన్సల్టెంట్లు బోగస్ డాక్యుమెంట్లతో మోసం చేసినట్లు గుర్తించారు.
Advertisement
Income TaxHyderabad

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more