'ప్రాజెక్టు K'లో విలన్ పాత్రధారి పారితోషికం 100 కోట్లు?
- షూటింగు దశలో 'ప్రాజెక్టు K'
- పాన్ వరల్డ్ స్థాయి సినిమా ఇది
- నార్త్ నుంచి భారీ తారాగణం
- సౌత్ నుంచి విలన్ గా కమలహాసన్
అలాంటి ఈ సినిమాలో కథానాయికగా దీపిక పడుకొణె నటిస్తోంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో అమితాబ్ .. అనుపమ్ ఖేర్ .. దిశ పటానీ కనిపించనున్నారు. నార్త్ నుంచి భారీ తారాగణం ఉండటం వలన, విలన్ ను సౌత్ నుంచి తీసుకోవాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారట. ఈ విషయం కూడా ఇంతకుముందే బయటికి వచ్చింది.
అదే ఇప్పుడు నిజమనేది తాజాగా వినిపిస్తున్న టాక్. సౌత్ నుంచి విలన్ పాత్ర కోసం కమల్ ను సంప్రదించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమా కోసం ఆయన 30 రోజులు కేటాయించారట. ఇందుకోసం ఆయన 100 కోట్ల పారితోషికాన్ని అందుకోనున్నట్టు చెబుతున్నారు. విలన్ గా కమల్ విశ్వరూప విన్యాసం ఎలా ఉంటుందో చూడాలి మరి!