‘అమిత్ షా గారూ.. వైజాగ్‌ను కాపాడండి’ అంటూ విశాఖపట్నంలో పలుచోట్ల పోస్టర్లు

విశాఖపట్నంలో జన జాగరణ సమితి పలుచోట్ల ‘అమిషా గారూ.. విశాఖను రక్షించండి’ అని రాసున్న పోస్టర్లు ఏర్పాటు చేసింది. నగరంలో భూకబ్జాలు, గనులు, గంజాయి మాఫియా, క్రికెట్ బెట్టింగ్ తదితర నేరాలు పెచ్చుమీరుతున్నాయని అర్థం వచ్చేలా ఈ పోస్టర్లు ఏర్పాటు చేసింది. 

ఈ సందర్భంగా జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో భూములకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. భూ కబ్జాలు, గంజాయి గురించిన వార్తలు తరచూ వింటున్నామని విచారం వ్యక్తం చేశారు. సాక్షాత్తూ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యులను రెండు రోజుల పాటు నిర్బంధించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. అరాచక శక్తులకు విశాఖ అడ్డాగా మారిందని గతంలో వ్యాఖ్యానించిన హోంమంత్రి అమిత్ షాయే నగరాన్ని కాపాడాలని ఆయన కోరారు.

Visakhapatnam District

More Telugu News