Advertisement

ఆదిపురుష్ రిలీజ్ తర్వాత.. ఓం రౌత్ తొలి ట్వీట్!

adipurush director om raut first reaction movie after release
  • థియేటర్లలో హనుమంతుడి కోసం కేటాయించిన సీట్ల ఫోటోలు షేర్ చేసిన ఓంరౌత్
  • దేశంలోని అన్ని థియేటర్లు భక్తితో నిండిపోయాయని వ్యాఖ్య
  • విమర్శలు, ట్రోల్స్ పై మాత్రం స్పందించని దర్శకుడు
దేశవ్యాప్తంగా ఆదిపురుష్ మేనియా నడుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ కీలక పాత్రలో ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. నెగటివ్ టాక్ వస్తున్నా.. ట్రోల్స్ చేస్తున్నా.. కలెక్షన్స్‌ మాత్రం రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ తర్వాత తొలిసారి ట్విట్టర్ లో ఓం రౌత్ స్పందించారు. థియేటర్లలో హనుమంతుడి కోసం కేటాయించిన సీట్ల ఫోటోలను ఆయన షేర్ చేశారు. ‘జై శ్రీరామ్‌’ అని రాసుకొచ్చారు. దేశంలోని అన్ని థియేటర్లు భక్తితో నిండిపోయాయని ఫొటోపై రాశారు. అయితే ఆదిపురుష్‌ కథ, గ్రాఫిక్స్, రాముడి వస్త్రధారణపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్ పై ఆయన స్పందించకపోవడం గమనార్హం.

మరోవైపు ఆదిపురుష్ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తొలి రోజే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకు పైగా వసూళ్లను ఈ సినిమా రాబట్టినట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. గతంలో ‘బాహుబలి’, ‘సాహో’ తర్వాత ఇప్పుడు ‘ఆదిపురుష్’ మొదటి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. తద్వారా మూడు సినిమాలతో ఈ మార్క్ ని అందుకున్న హీరోగా ప్రభాస్ నిలిచారు.
Advertisement
adipurush
om raut
Prabhas

More Telugu News