కేంద్ర క్రీడామంత్రి ఇంటికి చేరుకున్న రెజ్లర్లు.. సమస్య పరిష్కారమయ్యేనా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్ర క్రీడామంత్రి ఇంటికి చేరుకున్న రెజ్లర్లు.. సమస్య పరిష్కారమయ్యేనా?

Wrestlers reaches Anurag Thakur residence
  • చర్చలకు రెజ్లర్లను ఆహ్వానించిన అనురాగ్ ఠాకూర్
  • అనురాగ్ నివాసానికి వెళ్లిన భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్
  • ఇప్పటికే అమిత్ షాతో రెజ్లర్ల చర్చలు విఫలం
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న రెజ్లర్లు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ నివాసానికి చేరుకున్నారు. చర్చలు జరపడానికి రెజ్లర్లను అనురాగ్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీంతో మన దేశానికి చెందిన ప్రఖ్యాత రెజ్లర్లు భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ లు మంత్రి నివాసానికి వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రెజ్లర్ల చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనతో చర్చించడానికి రావాలని వారిని అనురాగ్ ఠాకూర్ ఆహ్వానించారు. ఈ చర్చల ద్వారా అయినా రెజ్లర్ల సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో వేచి చూడాలి.
Advertisement
Anurag Thakur
BJP
wrestlers

More Telugu News