Bandi Sanjay: ఒవైసీ కళ్లలో ఆనందం చూడ్డానికే కేసీఆర్ సచివాలయాన్ని తాజ్ మహల్ లాగా కట్టించారు: బండి సంజయ్

తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మించి, ఇటీవల ప్రారంభించడం తెలసిందే. అయితే నూతన సెక్రటేరియట్ నిర్మాణ శైలిని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా దీనిపై విమర్శనాస్త్రాలు సంధించారు. 

"కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ కడితే అది తాజ్ మహల్ లాగా ఉందని చెప్పింది ఒవైసీనే. కేసీఆర్ కు థాంక్స్ చెప్పింది ఒవైసీనే. నేను కూడా అదే చెబుతున్నా. గతంలో ఆంధ్రాలో ఓ మర్డర్ జరిగింది. ఎందుకు మర్డర్ చేశావని ఆ వ్యక్తిని అడిగితే... బావ కళ్లలో ఆనందం చూడ్డానికి మర్డర్ చేశా అని చెప్పాడు. ఇక్కడ కూడా అదే... ఒవైసీ కళ్లలో ఆనందం చూడ్డానికే కేసీఆర్ సచివాలయాన్ని తాజ్ మహల్ లా నిర్మించారు. అది వాస్తవం కూడా. చూస్తే మీకే అర్థమవుతుంది" అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Bandi Sanjay
Secretariat
KCR
Asaduddin Owaisi
BJP
BRS
MIM
Hyderabad
Telangana

More Telugu News