కమలహాసన్ వ్యాఖ్యలపై స్పందించిన 'ది కేరళ స్టోరీ' దర్శకుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కమలహాసన్ వ్యాఖ్యలపై స్పందించిన 'ది కేరళ స్టోరీ' దర్శకుడు

The kerala story director responds to kamal hassan remarks
  • 'ది కేరళ స్టోరీ'పై కమలహాసన్ విమర్శలు
  • ఇదో ప్రచార చిత్రమంటూ వ్యాఖ్యలు  
  • ఈ సినిమా చూడని వారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న దర్శకుడు సుదీప్తో సేన్ 
'ది కేరళ స్టోరీ'పై ప్రముఖ నటుడు కమలహాసన్ చేసిన వ్యాఖ్యలపై సినిమా దర్శకుడు సుదీప్తో సేన్ స్పందించారు. ఇదో ప్రచార చిత్రమంటూ కమలహాసన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు బట్టారు. ఇప్పటివరకూ ది కేరళ స్టోరీని తప్పుబట్టిన వాళ్లు సినిమా చూశాక తమ అభిప్రాయం మార్చుకున్నారని చెప్పారు. అందుకే తాను సినిమాపై వచ్చే కామెంట్స్‌కు స్పందించడం మానేశానని తెలిపారు. సినిమా చూడని వాళ్లే ఇలాంటి విమర్శలు చేస్తారన్నారు. 

‘‘తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో మా చిత్రంపై బ్యాన్ విధించారు. దాంతో ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు ఈ సినిమాను చూడలేదు. అందువల్లే వాళ్లు దీన్ని ఒక ప్రచార చిత్రమని అనుకుంటున్నారు. అలాగే, మన దేశంలో మూసధోరణులు ఫాలో అయ్యేవాళ్లు అధికంగా ఉన్నారు. జీవితమంటే కేవలం తెలుపు లేదా నలుపులోనే ఉండాలని అనుకుంటారు. బూడిద రంగులో ఉంటుందని వారికి తెలియదు’’ అని సుదీప్తో వ్యాఖ్యానించారు. సినిమా టైటిల్‌లో ది రియల్ స్టోరీ అని రాసుకున్నంత మాత్రాన అది వాస్తవం అయిపోదని కమలహాసన్ 'ది కేరళ స్టోరీ'ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Advertisement
Kamal Haasan

More Telugu News