ఇంట్లో ఎంతమంది మహిళలుంటే అంతమందికి నెలకు రూ.1500... టీడీపీ మేనిఫెస్టోతో చంద్రబాబు దూకుడు

28-05-2023 Sun 20:36 | Andhra
Advertisement
  • రాజమండ్రిలో టీడీపీ మహానాడు
  • భారీ బహిరంగ సభ వేదికగా మేనిఫెస్టో విడుదల
  • భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట మేనిఫెస్టో
  • నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి
  • మహిళలకు జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
Advertisement
రాజమండ్రి మహానాడు బహిరంగ సభ వేదిక పైనుంచి టీడీపీ అధినేత చంద్రబాబు  (ఫేజ్ 1)  ఎన్నికల మేనిఫెస్టో ఆవిష్కరించారు. యువత, మహిళలు, రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని మేనిఫెస్టోలో ప్రకటించారు. 

పేదల జీవితాల్లో వెలుగులు ఎలా తీసుకురావాలన్న దాని గురించే నిత్యం ఆలోచిస్తుంటామని తెలిపారు. సమర్థులకు, విద్యావంతులకే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. వారిది ధన బలం, మనది ప్రజాబలం... రేపటి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం అని పేర్కొన్నారు. కష్టకాలంలో టీడీపీ ఏంచేస్తుందని రాష్ట్ర ప్రజలంతా ఆలోచిస్తున్నారు... ఇప్పుడవన్నీ వివరిస్తాం అని చంద్రబాబు తెలిపారు. 

"నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి సుపరిపాలన వచ్చే ఐదేళ్లలో అందిస్తా. మంచి ఫలితాలు అందించేలా పరిపాలిస్తా. నా జీవితంలో రాబోయే ఐదేళ్లు మీరు ఊహించని విధంగా పనులు చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడి మళ్లీ ట్రాక్ లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక, కార్యకర్తలు రేపటి నుంచి చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇంటింటికీ తిరిగి మేనిఫెస్టోలో వివరాలను ప్రజలకు వివరించండి. దసరా నాటికి పూర్తి మేనిఫెస్టో తీసుకువస్తాం" అని చంద్రబాబు వివరించారు.

టీడీపీ మేనిఫెస్టో వివరాలు...

  • ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణ సౌకర్యం.
  • ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం.
  • ప్రతి నిరుద్యోగికి యువగళం నిధి కింద నెలకు రూ.3 వేలు ఇస్తాం.
  • ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
  • మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం... ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 మహిళల ఖాతాల్లో వేస్తాం. 
  • 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి వర్తిస్తుంది
  • ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి నెలకు రూ.1500.
  • తల్లికి వందనం కింద ప్రతి బిడ్డ తల్లికి ఏటా రూ.15 వేలు
  • స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తాం.
  • రైతులకు అన్నదాత కార్యక్రమం... రైతులకు ఏటా రూ.20 వేలు 
  • ఇంటింటికీ మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్
  • బీసీల కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తాం.

Advertisement
ChandrababuManifestoTDPMahanaduRajahmundryAndhra Pradesh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more