దీపావళి వేడుకలకు మా దేశానికి రండి.. ఆస్ట్రేలియా ప్రధానికి మోదీ ఆహ్వానం
- సిడ్నీలో అల్బనీస్ తో మోదీ సమావేశం
- పాల్గొన్న మంత్రి జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్
- అడ్మిలర్టీ హౌస్ లో మోదీకి గార్డ్ ఆఫ్ ఆనర్
సిడ్నీలోని అడ్మిరల్టీ హౌస్‌లో ప్రధాని మోదీకి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. హౌస్‌లోని సందర్శకుల పుస్తకంపై మోదీ సంతకం చేశారు. కాగా, అంతకుముందు మంగళవారం ఆస్ట్రేలియాలోని అగ్రశ్రేణి కంపెనీల ప్రతినిధులు, వ్యాపార నేతలతో మోదీ వరుస సమావేశాలు నిర్వహించారు. సాంకేతికతతో పాటు వివిధ రంగాల్లో భారతీయ కంపెనీలతో సహకారం పెంపొందించుకోవాలంటూ వారికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.