నాకు సపోర్టుగా నిలిచిన ఒక శక్తి నరేశ్ : పవిత్ర లోకేశ్

Malli Pelli Pre Release Event
  • నరేశ్ జోడీగా పవిత్ర లోకేశ్ 'మళ్లీ పెళ్లి'
  • ఈ నెల 26వ తేదీన సినిమా విడుదల
  • తన కలను తనే నిజం చేసుకుంటూ వచ్చానన్న పవిత్ర  
  • దుష్టశక్తులు తన లైఫ్ ను బ్రేక్ చేశాయని వ్యాఖ్య 

నరేశ్ - పవిత్ర లోకేశ్ జంటగా 'మళ్లీ పెళ్లి' సినిమా రూపొందింది. ఎమ్మెస్ రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ నెల 26వ తేదీన విడులవుతున్న ఈ సినిమా, హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. జయసుధ ముఖ్య అతిథిగా ఈ వేడుకను నిర్వహించారు. 
 
ఈ స్టేజ్ పై పవిత్ర లోకేశ్ మాట్లాడుతూ .. "ఇక్కడున్న పెద్దలందరి ఆశీస్సులు నాకు కావాలి. ఎందుకంటే న్యూ లైఫ్ ను ఆరంభించబోతున్నాను. దేవుడు ఎలా నిర్దేశిస్తే అలా మనం మన లైఫ్ ను ముందుకు తీసుకువెళ్లవలసిందే. చిన్నప్పటి నుంచి అందరిలాగానే నాకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉండేవి. నా చిన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు"

"నా డ్రీమ్స్ ను నిజం చేసుకోవడం కోసమే సినిమాల్లోకి వచ్చాను. ఎంతో కష్టపడి నేను నా డ్రీమ్స్ ను నిర్మించుకున్నాను. దానిని కొన్ని దుష్టశక్తులు బ్రేక్ చేశారు. ఆ సమయంలో నాకు సపోర్టు నిలిచిన ఒక శక్తి నరేశ్ గారు. ఇక ఇప్పుడు మళ్లీ నా లైఫ్ ను బిల్డ్ చేసుకోవడం మొదలుపెట్టాను' అంటూ చెప్పుకొచ్చారు. 


Go Back to Shorts
Naresh
Pavitra
Malli Pelli

More Telugu News