మహిళల పేరు ముందు కుమారి, శ్రీమతి వాడకుండా నిరోధించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు మొట్టికాయలు
- చూస్తుంటే ప్రచారం కోసమే పిటిషన్ వేసినట్టు ఉందన్న కోర్టు
- కోర్టు నుంచి ఎలాంటి ఊరట కోరుకుంటున్నారని ప్రశ్న
- పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం
చూస్తుంటే ఇది ప్రచారం కోసమే దాఖలు చేసినట్టు ఉందని అభిప్రాయపడింది. కోర్టు నుంచి ఎలాంటి ఊరట కోరుకుంటున్నారని ప్రశ్నించింది. కుమారి, శ్రీమతి వంటి పదాలను పేరుకు ముందు పెట్టుకోవాలని మహిళను అడగకూడదని మీరు అంటున్నారని, కానీ ఎవరైనా వాటిని వాడుకుంటే వారినెలా నిరోధిస్తారని నిలదీసింది. ఈ పదాలను వాడుకునేందుకు సాధారణ పద్ధతి అంటూ ఏదీ లేదని స్పష్టం చేసిన కోర్టు.. పేరుకు ముందు వాటిని ఉపయోగించాలా? వద్దా? అనేది ఆ వ్యక్తి ఎంపికను బట్టి ఉంటుందని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.