రాజకీయ అరంగేట్రంపై సినీ నటుడు సుమన్ క్లారిటీ!

Actor Suman said that he will entering into politics
  • మొగల్తూరు మండలంలో ఓ కార్యక్రమానికి హాజరైన సుమన్
  • తెలంగాణలో తన మద్దతు బీఆర్ఎస్‌కేనని స్పష్టీకరణ
  • రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ముందుకు రావాలన్న సినీ నటుడు
తాను రాజకీయాల్లోకి రావడం పక్కా అని ప్రముఖ సినీ నటుడు సుమన్ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కోమటితిప్ప గ్రామంలో నిన్న ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సుమన్ అనంతరం విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు చెప్పారు. తెలంగాణలో తన మద్దతు బీఆర్ఎస్‌కే ఉంటుందని తేల్చి చెప్పారు. 

అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందన్న సుమన్.. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలని అన్నారు. వర్షాలు, విపత్తులు ప్రతి సంవత్సరం వస్తుంటాయని, కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

కాగా, ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి. అయితే, రజనీకాంత్ వ్యాఖ్యల్లో తప్పు లేదని సుమన్ సమర్థించారు. హైదరాబాద్ అభివృద్ధి ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ప్రశంసించారు. హైదరాబాద్‌ను ఓ స్థాయికి తీసుకువచ్చింది బాబేనన్నారు. ఆధునిక హైదరాబాద్ నగర నిర్మాణంలో ముఖ్య శిల్పి చంద్రబాబేనని సుమన్ కొనియాడారు.
Go Back to Shorts
Actor Suman
West Godavari District
BRS
Tollywood

More Telugu News