సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘కథ వెనుక కథ’ .. రిలీజ్ డేట్ ఖరారు!

Katha Venuka katha movie update
  • కృష్ణ చైతన్య దర్శకుడిగా 'కథ వెనుక కథ'
  • సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • సంగీతాన్ని అందించిన శ్రవణ్ భరద్వాజ్ 
  • ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల
కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయడానికి ప్రారంభ‌మైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్. ఈ బ్యాన‌ర్‌పై రూపొందిన తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్ ..   శ్రీజిత గౌష్‌ .. శుభశ్రీ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాను అవ‌నీంద్ర కుమార్ నిర్మించారు.  సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ మూవీని మే 12న విడుదల చేస్తున్నారు.

చిత్ర నిర్మాత అవ‌నీంద్ర కుమార్ మాట్లాడుతూ ‘కథ వెనుక కథ’ .. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. మొదటి నుంచి చివరివరకూ అనూహ్యమైన మలుపులతో ముందుకు సాగుతోంది. సహజత్వానికి దగ్గరగా ..  ప్రతి పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. సీట్ ఎడ్జ్ మూమెంట్స్‌తో ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటుంది. మే 12న విడుదల చేస్తున్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అన్నారు.  

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ ‘‘నేను ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి 30 ఏళ్లు అయింది.  80కిపైగా సినిమాలు చేశాను. మా నిర్మాతగారు జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి వ‌చ్చారు. ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మంచి కంటెంట్‌తో చేసిన సినిమాను ఆద‌రిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు. 
Advertisement
Vishwanth
Srijitha
Subhasree
Sunil
Ali
Katha Venuka Katha

More Telugu News