ఆ విషయంలో వెబ్ సిరీస్ లే బెస్ట్: భూమిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ విషయంలో వెబ్ సిరీస్ లే బెస్ట్: భూమిక

Web Series are best says Bhumika
  • తమ వయసులో సగం ఉన్న హీరోయిన్లతో నటించేందుకు హీరోలు ఆసక్తి చూపుతున్నారన్న భూమిక
  • ప్రేక్షకులు కూడా దీన్ని అంగీకరిస్తున్నారని వ్యాఖ్య
  • వెబ్ సిరీస్ లలో హీరోయిన్లకు ప్రాధాన్యత లభిస్తోందన్న భూమిక
సినీ పరిశ్రమలో హీరోల హవానే నడుస్తుందని సినీ నటి భూమిక అన్నారు. తన వయసులో సగం ఉన్న హీరోయిన్లతో నటించేందుకు హీరోలు ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు. యువ హీరోయిన్లతో వయసు పెరిగిన హీరోలు నటించడాన్ని ప్రేక్షకులు, నిర్మాతలు కూడా అంగీకరిస్తున్నారని అన్నారు. పెద్దవారైన హీరోలతో నటించేందుకు యువ హీరోయిన్లు కూడా ఒప్పుకుంటున్నారని చెప్పారు. సినీ పరిశ్రమలో ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని చెప్పారు. ఈ విషయంలో వెబ్ సిరీస్ లే బెటర్ అని అన్నారు. వెబ్ సిరీస్ లలో హీరోయిన్లకు మంచి ప్రాధాన్యత లభిస్తోందని చెప్పారు.
Advertisement
Bhumika
Tollywood
Web Series

More Telugu News