గన్నవరం నియోజకవర్గంలో ఉద్రిక్తత... జిల్లా ఎస్పీకి చంద్రబాబు ఫోన్
- కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన
- ఆరుగొలను జంక్షన్ లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ
- పలువురికి గాయాలు
- తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్త
కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు రాక కోసం టీడీపీ కార్యకర్తలు నిరీక్షిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వైసీపీ జెండాతో వచ్చిన ఓ వ్యక్తి అక్కడ హంగామా సృష్టించే ప్రయత్నం చేయగా, పోలీసులు అతడిని పక్కకి తీసుకెళ్లారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో, టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది.
కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు హనుమాన్ జంక్షన్ లో కల్యాణి కుటుంబాన్ని పరామర్శించారు. కల్యాణి ఇటీవల అరెస్టయి, ప్రస్తుతం జైలులో ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరగ్గా, కల్యాణిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో, కల్యాణి కుటుంబ సభ్యులను కలిసిన చంద్రబాబు, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.